ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఉస్తాద్ భగత్ సింగ్' కి డేట్స్ కేటాయించిన పవన్ కళ్యాణ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2023, 06:51 PM

హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ మూవీలో పవన్ కళ్యాణ్‌ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించనుంది.

తాజా అప్డేట్ ప్రకారం, ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వుతున్నట్లు సమాచారం. ఈ సినిమా తమిళ సినిమా 'తేరి' కి రీమేక్ అనే సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ పవర్ ఫుల్ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa