ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టార్ హీరో తదుపరి సినిమాకి సుదీర్ఘ రన్‌టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2023, 06:29 PM

లవ్ రంజన్ దర్శకత్వంలో బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రణబీర్ కపూర్ ఒక సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'ఝూతి మైన్ మక్కర్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ రొమ్-కామ్ చిత్రం 8 మార్చి 2023న విడుదల కానుంది. ఈ సినిమాలో రణబీర్ సరసన శ్రద్ధా కపూర్ జోడిగా నటించింది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 159 నిమిషాల (2 గంటల 39 నిమిషాలు) రన్‌టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ సినిమా పై మంచి బజ్ సంపాదించింది. అనుభవ్ సింగ్ బస్సీ, డింపుల్ కపాడియా, బోనీ కపూర్ మరియు మోనికా చౌదరి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa