గత సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచిన 'దృశ్యం 2'తో అజయ్ దేవగన్ బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నారు. తాజగా ఈ స్టార్ హీరో తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'భోలా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ కైతీకి అధికారక రీమేక్. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా యొక్క ట్రైలర్‌ని మార్చి 6న గ్రాండ్‌గా లాంచ్ చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ డ్రామాలో టబు, అమలా పాల్, దీపక్ డోబ్రియాల్, సంజయ్ మిశ్రా, గజరాజ్ రావు మరియు వినీ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం మార్చి 30న IMAX 3D ఫార్మాట్‌లో కూడా విడుదల కానుంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అజయ్ దేవగన్ ఎఫ్ ఫిల్మ్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, టి-సిరీస్ మరియు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ బిగ్గీని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa