శివశంకర్ దేవ్ దర్శకత్వంలో యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న చిత్రం "CSI సనాతన్". ఈ సినిమాలో మిషా నారంగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అనీష్ సోలొమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ గా థర్డ్ సింగిల్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. మాంఛి పార్టీ సాంగ్ గా ఉండబోతున్న ఈ పాటను స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మార్చి 4వ తేదీన విడుదల చెయ్యబోతున్నారంటూ కాసేపటి క్రితమే మేకర్స్ నుండి అఫీషియల్ పోస్టర్ విడుదలయ్యింది.
చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa