రేపు థియేటర్లకు రాబోతున్న చిత్రాలలో జబర్దస్త్ ఆర్టిస్ట్ వేణు టిల్లు డైరెక్ట్ చేసిన "బలగం" ఒకటి. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు.
రేపు ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా తెలంగాణా ఐటీ మంత్రి శ్రీ KTR గారు దర్శకుడు వేణుని, చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియచేస్తూ ట్వీట్ చేసారు. అలానే ఈ సినిమా సిరిసిల్ల వైబ్రంట్ వాతావరణాన్ని, తెలంగాణా సంస్కృతీ సాంప్రదాయాలను ఆడియన్స్ కి మరింత చేరువ చెయ్యాలని కూడా కోరుకుంటున్నట్టు తెలిపారు. పోతే, నిన్ననే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సిరిసిల్లలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి KTR గారు ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa