పెను ప్రమాదం తదుపరి సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "విరూపాక్ష". సుకుమార్ అందించిన కథతో, కార్తీక్ దండు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పోతే, ఈ రోజు విరూపాక్ష సెట్స్ కి పవన్ వెళ్లి, టీజర్ ను చూసి చిత్రబృందాన్ని ప్రత్యేకంగా సాయిధరమ్ ని అభినందించారు.
ఈ నేపథ్యంలో మావయ్యకి కృతజ్ఞతలు తెలుపుతూ తేజ్ ట్వీట్ చేసారు. ఇంతకన్నా ఇంకేం కావాలి.. విరూపాక్ష సినిమా నాకెంతో కీలకం .. నా గురువు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ సినిమా యొక్క టీజర్ లాంచ్ కావడం, మమ్మల్ని అభినందించడం, గొప్పగా మాట్లాడడం... నిజంగా పండగలాగా ఉంది. నీ ప్రేమకు, అభినందనలకు, నాకు సపోర్ట్ గా ఉన్నందుకు థాంక్యూ కళ్యాణ్ మావయ్య..అంటూ తేజ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
పోతే, ఈ మూవీ పాన్ ఇండియా భాషల్లో ఏప్రిల్ 21న విడుదల కాబోతుంది. అంతకన్నా ముందుగా టీజర్ మార్చి 1న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa