టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం "దాస్ కా ధమ్కీ". ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా యొక్క ఓవర్సీస్ హక్కులను డీసెంట్ ఎమౌంట్ కి ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ "రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్" చేజిక్కించుకుందని అధికారికంగా తెలుస్తుంది.
వణ్మయి క్రియేషన్స్ ,VS సినిమాస్ సంయుక్త బ్యానర్ లపై తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అధికారిక విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa