అమృతం ఫేమ్ హర్షవర్ధన్ దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్బాబు నటిస్తున్న చిత్రం "మామా మశ్చీంద్ర". ఈ సినిమాలో సుధీర్ బాబు డీజే పాత్రలో నటించబోతున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరికి తెలియగా, రీసెంట్గా వైరల్ ఐన ఒక వీడియోను బట్టి సుధీర్ బాబు ఇందులో ఒక ఊబకాయుడిగా కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే, షాకింగ్ విషయమేంటంటే, ఈ సినిమాలో సుధీర్ బాబు త్రిబుల్ రోల్ లో నటిస్తున్నారు. అవును... ఈ విషయాన్ని అధికారికంగా పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఈ సినిమాలో దుర్గ, పరశురామ్, డీజే .. ఇలా మూడు విభిన్న పాత్రలలో డిఫరెంట్ గెటప్స్ లో సుధీర్ బాబు కనిపించబోతున్నారు. ఈ మూడు లుక్స్ ని ఒకేసారి కాకుండా మూడు రోజులలో విడుదల చెయ్యాలని మేకర్స్ తలంచారు. ఈ నేపథ్యంలో మార్చి 1న దుర్గ, 4న పరశురామ్, 7న డీజే లుక్స్ రివీల్ కాబోతున్నాయంటూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa