దసరా సినిమాతో నాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నాని పుట్టినరోజు సందర్భంగా ఇండియా వైడ్ మూవీ కౌంట్ డౌన్ ఇన్స్టలేషన్స్ చేసారు. మరి, ఈ ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ మరో ముప్పై రోజుల్లో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా 'ధరణి' కో స్టార్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఇంతకీ ధరణి బుజ్జి కో స్టార్ ఎవరంటే.. సూపర్ క్యూట్ కోడిపిల్ల.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa