యంగ్ హీరో శివ కందుకూరి నటిస్తున్న కొత్త చిత్రం "భూతద్దం భాస్కర్ నారాయణ". ఇందులో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. పురుషోత్తం రాజ్ డైరెక్షన్లో మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై స్నేహాల్ జంగాల, శశిధర్ కాశీ, కార్తీక్ ముదుంబి నిర్మించారు. శ్రీచరణ్, విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు డప్పుకొట్టి చెప్పుకోనా .. లవ్ డ్యూయెట్ విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa