వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తొంభైల కాలంలో కాశ్మీరీ పండితులు ఎదురుకొన్న హృదయవిదారకర పరిస్థితులను, వారి ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించిన "ది కాశ్మీర్ ఫైల్స్" చిత్రం ప్రతి ఒక్క భారతీయుడిని కదిలించింది.
ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఈ మూవీ రీసెంట్గానే అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకుంది. తాజాగా జీ సినీ అవార్డులలో ఏకంగా 4 అవార్డులతో సత్తా చాటింది. బెస్ట్ ఫిలిం వ్యూయర్స్ ఛాయిస్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్స్ విభాగాల్లో కాశ్మీర్ ఫైల్స్ మూవీ విజేతగా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa