శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" నుండి రీసెంట్గా ఫస్ట్ సింగిల్ కనుల చాటు మేఘమా.. లిరికల్ వీడియో విడుదలయ్యింది. వింటేజ్ వైబ్స్ తో కూడిన ఈ బ్రేకప్ ఘజల్ కి యూత్ ఆడియన్స్ నుండి విశేష స్పందన వస్తుంది. తాజాగా ఈ గీతాన్ని మెచ్చుకుంటూ ఆస్కార్ అవార్డు నామినీ, గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నర్, కీరవాణి గారు ట్వీట్ చేసారు. శ్రీనివాస్ అవసరాల, కళ్యాణి మాలిక్ ల కలయికలో వచ్చిన లేటెస్ట్ సాంగ్ కనుల చాటు మేఘమా పాట సూథింగ్ మరియు బ్యూటిఫుల్ మెలోడీ.. అంటూ కీరవాణి ట్వీట్ లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa