ప్రముఖ నటి, రచయిత అయిన పారిస్ హిల్టన్ తన కొత్త బుక్ రిలీజ్ వేళ ఆమెకు యుక్త వయసులో జరిగిన 2 చేదు అనుభవాలను పంచుకుంది. తనకు 15 ఏళ్లు ఉన్నప్పుడు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి ఓ వృద్ధుడు తనపై అత్యాచారం చేశాడని చెప్పుకొచ్చింది. అలాగే తన టీచర్ తనను వేధించేవాడని, కారులోకి లాకెళ్లి బలవంతంగా ముద్దు పెట్టేవాడని తెలిపింది. తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పలేకపోయానని హిల్టన్ భావోద్వేగానికి గురైంది.