ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన PKSDT మూవీపై రోజుకొక ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. థమన్ ఈ సినిమాకు స్వరాలను సమకూరుస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులోనే విడుదల కాబోతుందని మరొక క్రేజీ బజ్ వైరల్ అయ్యింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa