కన్నడ హీరో కం డైరెక్టర్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఫీల్ గుడ్ మూవీ "777చార్లీ". ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో గతేడాది జూన్ 10వ తేదీన విడుదలై, సూపర్ హిట్ అయ్యింది. కిరణ్ రాజ్ దర్శకత్వంలో కామెడీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని జి.ఎస్ గుప్తా తో కలిసి రక్షిత్ శెట్టినే నిర్మించారు. ప్రేక్షకుల నుండి ముఖ్యంగా పెంపుడు కుక్కలను ప్రాణంగా చూసుకునే వారినుండి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది.
తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. విశేషమేంటంటే, ఈ సినిమాలో మొత్తం 30 పాటలున్నాయి. అన్ని కూడా సిట్యుయేషనల్ సాంగ్సే. నోబిన్ పాల్ ఈ సినిమాకు స్వరాలను సమకూర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa