ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ వాయిదా పడబోతుందా ?

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2023, 01:13 PM

దర్శకరత్నం మణిరత్నం నుండి రీసెంట్గా వచ్చిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా "పొన్నియిన్ సెల్వన్ 1". చియాన్ విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, త్రిష, జయంరవి తదితరులు ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ లో పాన్ ఇండియా భాషల్లో విడుదలై, అన్నిచోట్లా ఘనవిజయం సాధించింది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా యొక్క రెండవ భాగం ఏప్రిల్ 28వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జరిగింది.  


ఐతే, ఇప్పుడు PS 2 విడుదల వాయిదా పడబోతుందని, సాంకేతిక పనులు ఇంకా పూర్తి కాకపోవడమే ఇందుకు కారణం అని ప్రచారం జరుగుతుంది. మరైతే, ఈ విషయంపై నిజానిజాలు తెలియాల్సి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa