ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాలిడ్ TRPని నమోదు చేసిన సమంత 'యశోద'

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2023, 08:03 PM

హరి శంకర్ అండ్ హరీష్ నారాయణ్ డైరెక్షన్ లో సౌత్ ఇండియా సిజ్లింగ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు నటించిన 'యశోద' మూవీ నవంబర్ 11, 2022న థియేటర్లలో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.
 
ఇటీవల ఈ చిత్రం ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ ETVలో ప్రదర్శించబడింది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం మొదటి టెలికాస్ట్‌లో 4.88 టిఆర్‌పిని పొందింది. ఈ చిత్రం ప్రస్తుతం OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.

ఈ సినిమాలో రావు రమేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీదేవి మూవీ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa