చిత్రం : రంగమార్తాండ
సంగీతం, గానం : ఇళయరాజా
సాహిత్యం : లేట్. శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి
పల్లవి :
పువ్వై విరిసే ప్రాణం
పండై మురిసే ప్రాయం
రెండూ ఒకటే నాణేనికి బొమ్మా బోరుసంతే
తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే
చరణం 1:
నడకైనా రాని పసిపాదాలే అయినా
బతుకంతా నడిచి అలిసిన అడుగులే అయినా
చెబుతాయా చేరే మజిలీ ఏదో
చరణం 2:
ఒక పాత్ర ముగిసింది నేడు
ఇంకెన్ని మిగిలాయో చూడు
తానే తన ప్రేక్షకుడౌతాడు
పల్లవి 2:
ఎవడో ఆ సూత్రధారి
తెలుసా ఓ వేషధారి
మళ్ళీ మళ్ళీ వందేళ్లు రోజూ సరికొత్తే
ఎప్పటికైనా తెలిసేనా బతకడమేంటంటే
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa