ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. యూఎస్‌లో ఫేమస్ టెలివిజన్ ప్రోగ్రాం 'గుడ్ మార్నింగ్ అమెరికా' నుంచి చెర్రీకి ఆహ్వానం అందడంతో అక్కడికి వెళ్లారు. ఈ విషయమై తాజాగా చిరంజీవి పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్ చరణ్ పాల్గొనటం అనేది తెలుగు, ఇండియన్ సినిమాకు గర్వించే క్షణాలు అని పేర్కొంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.