సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ రోజు తేజ్ ట్విట్టర్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసారు. సముద్రఖని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సారథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యణ్ తో కలిసి తేజ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఈ రోజు ఉదయమే జరిగింది. ఈ రోజు నుండే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తేజ్ ట్వీట్ చెయ్యడం జరిగింది. ఈరోజుని జీవితాంతం గుర్తుంచుకుంటా.. నా జీవిత గురువు పవన్ కళ్యాణ్ గారితో కలిసి పని చెయ్యడం నిజంగా కల సాకారమైనట్టే.. ఈ అద్భుతమైన అవకాశానికి రుణపడి ఉంటా.. షూట్ టైంలో ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకోవడానికి, మరెన్నో జ్ఞాపకాలను పోగేసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. అని తేజ్ ట్వీట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa