మసూద సినిమాతో ప్రేక్షకులను భయపెట్టిన యువనటుడు తిరువీర్ నటిస్తున్న కొత్త చిత్రం "పరేషాన్". ఈ మూవీ టీజర్ నిన్న విడుదల కాగా, దానికి ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. 500కే వ్యూస్ సాధించి, ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఎలాంటి బాధ్యత లేకుండా మందుకు బానిసైన వారి నేపథ్యంలో సాగే ఈ సినిమాను వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సిద్దార్థ్ రాళ్ళపల్లి నిర్మిస్తున్నారు. రూపక్ రొనాల్డ్సన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తున్నారు. బన్నీ అబిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa