గోపీచంద్ కొత్త సినిమా 'రామబాణం' నుండి విడుదలైన తొలి ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్, ఆపై ఎమోషనల్ ఫ్యామిలీ టచప్ తో వచ్చిన ఈ గ్లిమ్స్ వీడియో యూట్యూబ్ ట్రెండింగ్లో దూసుకుపోతూ ఇప్పటివరకు 1 మిలియన్ వ్యూస్ ని రాబట్టింది.
శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, ఖుష్బూ కీరోల్స్ లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa