యశోద పాన్ ఇండియా సక్సెస్ తదుపరి క్రేజీ హీరోయిన్ సమంత "శాకుంతలం" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గుణశేఖర్ డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే.
రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శాకుంతలం టీం నుండి స్పెషల్ పోస్టర్ విడుదలయ్యింది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు .. అని విష్ చేస్తున్న ఈ పోస్టర్ కాసేపటి క్రితమే విడుదలయ్యింది. లిరికల్ సాంగ్స్, పోస్టర్లతో అంతకంతకూ అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమా విడుదల కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి ముస్తాబవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa