మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం "రావణాసుర" నుండి కాసేపటి క్రితమే సెకండ్ సింగిల్ 'ప్యార్ లోన పాగల్' లిరికల్ ప్రోమో విడుదలయ్యింది. రవితేజ మార్క్ ఎనర్జిటిక్ బ్రేకప్ సాంగ్ గా ఉంది ఈ పాట. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఫుల్ సాంగ్ ఈనెల 18న రాబోతుంది.
సుధీర్ వర్మ దర్శకత్వంలో సరికొత్త కధాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ పనులను జరుపుకుంటుంది. ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa