స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సినిమాల నుంచి తప్పుకొని, డాక్టర్ వృత్తిలో స్థిరపడాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దీనిపై సాయిపల్లవి స్పందించలేదు. కాగా ఇప్పుడు ఆమె ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఆమె పచ్చజెండా ఊపినట్లుగా సమాచారం. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయబోతున్న ఈ వెబ్ సిరీస్‌లో సాయి పల్లవి నటించేందుకు ఓకే చెప్పిందట. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa