ప్రస్తుతం టీవీల్లో చానెళ్లు చూడాలంటే సెట్ టాప్ బాక్స్ తప్పనిసరి. ఇకపై సెట్ టాప్ బాక్స్ లేకుండానే చానెల్స్ చూసే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 200కి పైగా చానెల్స్ కు యాక్సెస్ అందించడానికి టీవీల్లోనే ఇంటర్నల్ శాటిలైట్ ట్యూనర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ వెల్లడించారు. ఈ టీవీలను కొంటే దాంతో పాటు యాంటెన్నాను ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేస్తే, ఫ్రీ చానెల్స్, రేడియో చానెల్స్ ప్రసారం పొందొచ్చు.