రిపబ్లిక్ చిత్రం తర్వాత 2 సంవత్సరాల విరామం తీసుకున్న ప్రముఖ రచయిత మరియు దర్శకుడు దేవా కట్టా తాజాగా ఇప్పుడు 4 కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించారు. వెన్నెల దర్శకుడు తన రాబోయే ప్రాజెక్ట్‌ల వివరాలను ప్రకటించారు. వాటిలో ఒకటి 'ఇంద్రప్రస్థం' వెబ్-సిరీస్. అంతేకూండా ఈ జ్ఞానపీఠ్ అవార్డు-విజేత సాహిత్య కళాఖండానికి అనుసరణగా ఉండే సిరీస్‌లో కూడా పని చేస్తున్నాడు. రెండు ప్రాజెక్ట్‌లు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయని దర్శకుడు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ల గురించి మరిన్ని వివరాలను రానున్న రోజులలో వెల్లడిస్తానని నంది అవార్డు గ్రహీత చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa