టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు దర్శకుడు రామ్ అబ్బరాజుతో కలిసి ఒక చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ రోజు మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్‌తో పాటు హాస్యభరితమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'సమాజవరగమన' అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది.
వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు రెబా మోనికా జాన్ సంగీత వాయిద్యంతో పాటుగా చేతిలో వీణ పట్టుకుని శ్రీవిష్ణు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపిస్తున్నారు. సమాజవరగమన ఫస్ట్‌లుక్ పోస్టర్ పూర్తిగా వినోదభరితమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే భావన కలిగిస్తుంది.
బిగిల్ ఫేమ్ రెబా మోనికా జాన్ ఈ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తుంది. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి కెమెరా క్రాంక్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa