పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రాబోతున్న రెండో సినిమా "ఉస్తాద్ భగత్ సింగ్". గతేడాది చివర్లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. హరీష్ - పవన్ - DSP ల కలయికలో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' రికార్డు బ్రేకింగ్ విజయం సాధించడంతో ఈ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ పై రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు పవన్ అభిమానులకు క్రేజీ అప్డేట్ ఒకటి ఇచ్చారు. ఒక లైవ్ కాన్సర్ట్ లో మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సాంగ్ ను వెరీ రీసెంట్గా పూర్తి చేసానని, ఆ పాట చాలా బాగా వచ్చిందని, చెప్పాలంటే వేరే లెవెల్లో ఉంటుందని చెప్పారు. దీంతో పవన్ అభిమానుల్లో ఎక్జయిట్మెంట్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa