మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కలయికలో మూడవ సినిమా (అతడు, ఖలేజా తదుపరి SSMB 28) రూపొందుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గానే SSMB 28 షూటింగ్ హైదరాబాద్ అమీర్ పేట పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ షెడ్యూల్ లో మహేష్ పలు కీలక యాక్షన్ సన్నివేశాలలో నటించారు. ఈ షెడ్యూల్ లో విలక్షణ నటుడు జగపతి బాబు గారు కూడా పాల్గొన్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఇప్పుడు జగపతి బాబు గారే ఈ సినిమాలో మెయిన్ క్రూయల్ విలన్ అని అంటున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa