ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు ఓటిటీలలో "గాలోడు" డిజిటల్ ప్రీమియర్..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 13, 2023, 05:45 PM

ఈ నెల 17 నుండి ఆహా లో 'గాలోడు' డిజిటల్ ప్రీమియర్ కి రాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్ననే ఆహా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసింది. ఐతే, తాజాగా గాలోడు మూవీ రెండు ఓటిటీలలో డిజిటల్ ప్రీమియర్ కి రాబోతుందని తెలుస్తుంది. మహాశివరాత్రి కానుకగా ఈ నెల 17 నుండి గాలోడు మూవీ ఆహా మరియు, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటీలలో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. 


టెలివిజన్ హోస్ట్ గా, కమెడియన్ గా, మంచి ఎంటర్టైనర్ గా, హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఈ సినిమాలో హీరోగా నటించగా, సుధీర్ కు జోడిగా గెహన సిప్పి నటించింది. రాజశేఖర్ పులిచర్ల డైరెక్ట్ చేసి, నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa