దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న తొలిచిత్రం "వినరో భాగ్యము విష్ణు కథ". లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి జంటగా నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు తిరుపతిలో గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. మహాశివరాత్రి కానుకగా ఈ నెల 18న థియేటర్లలో సందడి చెయ్యడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ గారు సమర్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa