టైటానిక్, ఈ లవ్ స్టోరీ 25 ఏళ్లుగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయినా, క్లైమాక్స్ లో జాక్ మరణం మాత్రం చాలామందికి రుచించలేదు. నిజానికి మూవీలో అతను చనిపోయే సమయంలో ఓ డోర్ జాక్ కు దొరుకుతుంది. దానిపై రోజ్ ను ఎక్కించి ఆమెను కాపాడుతాడు. ఆ డోర్ పై ఇద్దరూ బతికే అవకాశం ఉండేదని కొందరు కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన కామెరాన్, ఆ డోర్ ను నేను కాస్త చిన్నదిగా చూపుంటే ఈ ప్రశ్నలు తలెత్తేవి కావన్నారు. కాగా, ఈ సినిమా శుక్రవారం రీరిలీజ్ కాబోతోంది.