కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన సినిమాలలో పాటలు పాడడమే కాక ఇతర హీరోల సినిమాలలో కూడా పాటలు పాడుతున్నారు. తాజాగా 'విందుతలై' అనే సినిమాలో ధనుష్ ఒక పాట పాడారు. అదికూడా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారి స్వరకల్పనలో. తాజాగా ఆ పాట విడుదలైంది. వినడానికి చాలా బాగుంది. ధనుష్ తో కలిసి సింగర్ అనన్యా భట్ ఈ పాటను పాడారు.
దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్ డైరెక్షన్లో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సూరి, విజయ్ సేతుపతి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. RS ఇన్ఫోటైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రముఖ రెడ్ జైంట్ మూవీ సంస్థ విడుదల చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa