టీజర్ తో సెన్సేషన్ సృష్టించిన దసరా మూవీ నుండి అతి త్వరలోనే సెకండ్ సింగిల్ విడుదల కాబోతుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు దసరా సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నట్టు తెలిపారు.
కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో, నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణసారధ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సాయి కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పోతే, ఈ సినిమా మార్చి 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa