కియారా అద్వానీ-సిద్ధార్థ మల్హోత్రా పెళ్లి వార్త బయటకు రావడంతో ఓ ట్విట్టర్ యూజర్.. వీరు డేటింగ్‌లో ఉంది నిజమేనా?' అని ట్వీట్ చేశాడు. దీనికి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆసక్తికర రీతిలో స్పందించింది. 'అవును వారు డేటింగ్‌లో ఉన్నారు. కానీ బ్రాండ్ల కోసం, సినిమాల ప్రమోషన్ల కోసం కాదు. ఈ జంట ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ఎప్పడు ప్రయత్నించలేదు. చాలా చిత్తశుద్ధితో, నిజమైన ప్రేమ కలిగిన చూడముచ్చటైన జంట వీరిద్దరిది' అని బదులిచ్చింది.