మెగాస్టార్ చిరంజీవి గారి ఆల్ టైం బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ లో "గ్యాంగ్ లీడర్" ఒకటి. విడుదలై ముప్పై ఏళ్ళు నిండిన సందర్భంగా ఈ సినిమాను మరోసారి థియేటర్లకు తీసుకొచ్చేందుకు మేకర్స్ శతవిధాలా కృషి చేస్తున్నారు. కానీ ప్రతిసారి నిరాశే మిగులుతుంది. ముందుగా డిసెంబర్ 31 వ తేదీన గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్ ఉంటుందని ఎనౌన్స్ చేసిన మేకర్స్ పై ఫిబ్రవరి 11, 2023కి వాయిదా వేశారు. ఇప్పుడు ఫిబ్రవరి 11 న కూడా గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్ కావట్లేదని ప్రకటించడంతో, మెగా ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.
విజయ బాపినీడు డైరెక్షన్లో క్రైమ్ యాక్షన్ ఫిలిం గా రూపొందిన ఈ సినిమా 1991లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇందులో విజయశాంతి హీరోయిన్ గా నటించగా, రావు గోపాలరావు, ఆనంద్ రాజ్, మురళి మోహన్, శరత్ కుమార్ కీరోల్స్ లో నటించారు. బప్పి లహరి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa