'మాలికాపురం' ..ఈ డివోషనల్ సినిమా రీసెంట్గానే మలయాళంలో విడుదలై, మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా తెలుగులో జనవరి 26వ తేదీన విడుదలైంది. అల్లు అరవింద్ గారి గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. తెలుగులో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.
ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి అఫీషియల్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 15నుండి మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ భాషలలో మాలికాపురం డిజిటల్ ప్రీమియర్ కాబోతుందని తెలుస్తుంది.
అయ్యప్ప స్వామి కథా నేపథ్యంలో చిన్న పిల్లలు లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ స్పెషల్ రోల్ లో నటించారు. విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa