మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "రావణాసుర". కాసేపటి క్రితమే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గా రావణాసుర యాంథెం లిరికల్ వీడియో విడుదలైంది. ప్రఖ్యాత శాంతి పీపుల్ తో కలిసి సింగర్స్ హారిక నారాయణ్, నోవాలిక్ ఆలపించిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేసారు. ఎలక్ట్రిఫయింగ్ మ్యూజిక్ తో ఈ పాట వినడానికి చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా నేటి యువతరానికి సులభంగా చేరుకునే పాట ఇది.
సుధీర్ వర్మ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మేఘా ఆకాష్, ఫారియా అబ్దుల్లా కీరోల్స్ లో నటిస్తున్నారు. సుశాంత్ విలన్గా నటిస్తున్నారు.
పోతే, ఏప్రిల్ 7వ తేదీన రావణాసుర థియేటర్లకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa