కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్, రష్మిక మండన్నా జంటగా నటించిన చిత్రం "వారిసు". వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకాభిమానుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వారిసు మ్యాజికల్ కలెక్షన్లను నమోదు చేస్తుంది. తాజాగా వారిసు/ వారసుడు కలెక్షన్లు వరల్డ్ వైడ్ గా 300కోట్ల మైల్ స్టోన్ మార్క్ ను చేరుకున్నాయని అధికారికంగా తెలుస్తుంది. దీంతో విజయ్ కెరీర్ లో 300కోట్ల మార్క్ ను టచ్ చేసిన రెండవ చిత్రంగా వారిసు సెన్సేషన్ సృష్టించింది. పోతే, ఈ ఫీట్ అందుకున్న ఐదవ తమిళ చిత్రంగా కూడా వారిసు రికార్డు నమోదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa