నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన న్యూ మూవీ "వీరసింహారెడ్డి" సంక్రాంతి కానుకగా ధియేటర్లకొచ్చిన వీరసింహారెడ్డి తొలి రోజు బాలయ్య కెరీర్ లో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లను వసూలు చేసిన విషయం తెలిసిందే.
సక్సెస్ఫుల్ థియేటర్ రన్ జరుపుకుంటున్న ఈ సినిమా నేటితో 25 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం కేక్ కట్ చేసి, గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ను మైత్రి సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని డైరెక్టర్ గా వ్యవహరించారు. థమన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa