తమిళ స్టార్ హీరో కార్తీ, డైరెక్టర్ పి. ఎస్. మిత్రన్ దర్శకత్వంలో చేసిన సినిమా "సర్దార్". రాశి ఖన్నా, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటి లైలా క కీలక పాత్రలో నటించారు. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
గతేడాది విడుదలైన ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ సక్సెస్ సాధించింది. అలానే తెలుగులో కూడా సర్దార్ మంచి వసూళ్లను రాబట్టాడు. ఓటిటిలో కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న సర్దార్ తాజాగా బుల్లితెరపై సందడి చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఈ మేరకు ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు జీ ఛానెల్ లో సర్దార్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రాబోతుందని తెలుస్తుంది. థియేటర్ , ఓటిటి ఆడియన్స్ ను విశేషంగా అలరించిన సర్దార్ బుల్లితెర ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa