ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల తీసుకున్న విషయం తెలిసిందే. కాగా విడిపోయిన తరువాత కూడా సమంత సినిమాలకు అక్కినేని హీరోలు, అక్కినేని హీరోల సినిమాలకు సమంత రియాక్ట్ అవ్వడం అందర్నీ ఆకట్టుకుంటుంది. తాజాగా ‘ఏజెంట్’ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన ఓ వీడియోని అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ‘బీస్ట్ మోడ్ ఆన్’ అంటూ సమంత కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్ హైలైట్‌గా మారింది.