కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ "సార్". తమిళంలో "వాతి". నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 17న తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
ఈ రోజు చెన్నైలోని సాయిరాం కాలేజీలో వాతి గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ జరగబోతున్న విషయం తెలిసిందే. కాసేపటి క్రితమే వాతి ఆడియో ఆల్బమ్ ఎక్జాక్ట్ రిలీజ్ టైం ను ఎనౌన్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఆరింటికి వాతి ఫుల్ ఆడియో ఆల్బమ్ విడుదల కాబోతుందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa