ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షక్కింగ్ TRPని నమోదు చేసిన 'కాంతారా'

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 09:00 PM

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' తెలుగు డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 14న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేసిన ఈ సినిమా కన్నడలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ విలేజ్ డ్రామా తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జనవరి 22, 2023న సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమైంది.


తాజాగా సమాచారం ప్రకారం, ఈ చిత్రం 12.35 టిఆర్‌పి రేటింగ్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఒక సినిమా డబ్బింగ్‌ వెర్షన్ కి కూడా ఇంత అద్భుతమైన రివ్యూ రావడం అసాధారణమని నెటిజన్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa