ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రైటర్ పద్మభూషణ్' అఫీషియల్ డిజిటల్ పార్ట్నర్ ఫిక్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 06:41 PM

ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన "రైటర్ పద్మభూషణ్" చిత్రం ఈరోజే థియేటర్లకు రావడం జరిగింది. స్పెషల్ ఫ్యామిలీ ప్రీమియర్స్ తో ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా ఫస్ట్ షో నుండే హిట్ టాక్ సొంతం చేసుకుని ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.


తాజాగా రైటర్ పద్మభూషణ్ మూవీ అఫీషియల్ డిజిటల్ పార్టనర్ పై సాలిడ్ క్లారిటీ వస్తుంది. ఈ మేరకు జీ 5 సంస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిందని తెలుస్తుంది. సో, ఫ్యూచర్ లో రైటర్ పద్మభూషణ్ డిజిటల్ రాక జీ 5 ఓటిటిలో ఉండబోతుందన్న మాట.


సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా షణ్ముఖ ప్రశాంత్ డైరెక్ట్ చేసారు. లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కట్ ఫిలిమ్స్ సంయుక్త బ్యానర్ లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa