ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ - లోకేష్ ల "లియో" రిలీజ్ డేట్ ఫిక్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 06:25 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కెరీర్ లో 67వ సినిమాగా రూపొందుతున్న ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ఎనౌన్స్మెంట్ ప్రోమో కాసేపటి క్రితమే విడుదలైంది. ఈ ప్రోమోలోనే రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేసి, ఆడియన్స్ లో ఎక్జయిట్మెంట్ లెవెల్స్ ను మేకర్స్ పెంచేశారు. ఈ ఈ మేరకు విజయ్ - లోకేష్ కనగరాజ్ ల కలయికలో రాబోతున్న రెండో సినిమా ఈ ఏడాది అక్టోబర్ 19న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది. ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా.... "లియో"... బ్లడీ స్వీట్ .. అనేది ట్యాగ్ లైన్.


త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ కీరోల్స్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కాశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa