ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"కబ్జా" ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైం ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 06:14 PM

రియల్ స్టార్ ఉపేంద్ర, బాద్షా కిచ్ఛా సుదీప్ నటిస్తున్న మల్టీస్టారర్ "కబ్జా". R చంద్రు డైరెక్షన్లో అండర్ వరల్డ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ శ్రేయా శరణ్ కీరోల్ లో నటిస్తుంది. ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. 


మార్చి 17న కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. తాజాగా కబ్జా చిత్రబృందం మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసింది. రేపు రాత్రి ఏడు గంటలకు కబ్జా టైటిల్ లిరికల్ సాంగ్ విడుదల కాబోతున్నట్టు కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు రేపు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో కబ్జా టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కు ఉపేంద్ర, శ్రేయ శరణ్ రాబోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa