నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త చిత్రం "అమిగోస్" ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇక, ట్రైలర్ ను బట్టి ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో నడిచే ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఒకే పోలికలున్న మనుషులు, స్నేహితులు కాదు..అన్నదమ్ములు కాదు.. ఒకవేళ కలుసుకుంటే..ఏమవుతుంది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ కి ఆసక్తికరమైన కథాకథనాలను జోడించి, డైరెక్టర్ రాజేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది.
ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీరోల్స్ లో నటిస్తున్నారు. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
పోతే, ఫిబ్రవరి 10వ తేదీన అమిగోస్ మూవీ థియేటర్లకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa