ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి ప్రవేశించిన 'మలికప్పురం'

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 02, 2023, 05:08 PM

విష్ణు శశి శంకర్ దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించిన 'మలికప్పురం' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ చిత్రం పవిత్ర శబరిమలను సందర్శించాలనుకునే 8 సంవత్సరాల బాలిక గురించి. తాజాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరి సంచలన సృష్టిస్తుంది. ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ ద్వారా ఇదే విషయాన్ని తెలియజేశాడు. అత్యద్భుతమైన స్పందనకు ప్రేక్షకులకు నటుడు ధన్యవాదాలు తెలిపారు.

ఈ డివైన్ హిట్‌లో సైజు కురుప్, మనోజ్ కె జయన్, రాంజీ పనికర్, రమేష్ పిషారోడి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో ఇటీవల విడుదల చేసారు. నీతా పింటో, ప్రియా వేణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రంజిన్ రాజ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa